తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామంలో శనివారం రాత్రి ఎన్పోర్సుమెంట్ అధికారులు అక్రమంగా నిల్వ వుంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. గ్రామంలోని గుజ్జుల వెంకట సుబ్బారెడ్డి అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ వుంచి, రవాణా చేసేందుకు సిద్ధంగా వున్నాడన్న సమాచారం అందటంతో దర్శి ఎన్ఫోర్సుమెంట్ ఇంచార్జి డీటీ ఎస్.రాధాకృష్ణ ఆద్వర్యంలో సిబ్బంది శనివారం రాత్రి 9 గంటల సమయంలో గుజ్జుల వెంకట సుబ్బారెడ్డి ఇంటిని తనికీ చేశారు. ఆ ఇంటిలో 64 ప్లాస్టిక్ బస్తాల పీడీఎస్ రైస్ వున్నట్లు గుర్తించారు. ఆబస్తాల బియాన్ని తూకంవేయగా 2530 కేజీలు వుండివాటి విలువ రూ93,610లుగా నిర్ధారించారు.ఎన్ పోర్సుమెంట్ అధికారులు, విజిలెన్సు అధికారుల సమక్షంలో ఆదివారం పంచనామా నిర్వహించారు. అక్రమ రేషన్ బియ్యాన్ని, ముద్దాయిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. స్థానిక ఎస్సై ఎస్.మల్లిఖార్జునరావు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా నిల్వవుంచిన 64 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత -తాళ్లూరు పోలీసులకు అప్పగింత-కేసునమోదు
06
Apr