దివ్యాంగుడికి నూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ రూ. 45వేల రూపాయలు చేయూత ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని పెద్దరావీడు మండలం నుంకేనుల గ్రామం నందు నివసిస్తున్న అబ్రహం కరెంటు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం బంకు ఏర్పాటు చేసుకున్నాడు. నూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ నర్దార్ భాష మాట్లాడుతూ అబ్రహం మా ట్రస్టు వద్దకు వచ్చి నేను ఎటువంటి పని చేయలేకపోతున్నాను తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు నాకు ఇద్దరు పిల్లలు వాళ్లను కూడా పోషించలేక నా భార్య నేను చాలా ఇబ్బందికి గురవుతున్నామని తన పరిస్థితిని వివరించాడు. పరిస్థితిని పరిశీలించి తగిన న్యాయం చేయాలని తలచి దాత ప్రవాస భారతీయుడు నరేష్ కుమార్ సహాయం చేసిన రూ.45 వేల రూపాయలతో వారి కుటుంబాన్ని మొత్తం పోషించుకునే విధంగా బంకు ఏర్పాటు చేసారు. దాతకు , ట్రస్టు సభ్యులకు అబ్రహం కుటుంబ సభ్యులు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
