గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను పరిశీలించి అర్హలైన వారికి న్యాయం చేస్తామని ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న తెలిపారు.
మండలంలోని ఏక లవ్య నగర్ వాసులు సోమవరప్పాడు సర్వే నంబర్ 370 నుండి 405 మధ్య ఉన్న వ్యవసాయ భూమిని మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని, అటవీ హక్కుల చట్టం ప్రకారం తమకు పట్టాలు మంజూరు చేయ్యాలని అనేక పర్యాయాలు ప్రభుత్వాలకు, అధికారులకు విన్నవించారు. ట్రైబర్ రైట్స్ ఫోరం చైర్మన్ ఇట్టా బాబు రావు కూడ హైకోర్టును ఆశ్రయించగా వారిని న్యాయం చెయ్యాలని కోర్టు రెవిన్యూ అధికారులను ఆదేశించారు. అయినప్పటికి ఫైల్ ముందుకు కదలక పోవటంతో మరోసారి కోర్టు దిక్కరణ ఫిటిషన్ ను దాఖలు చేసారు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ముందుకు కదిలారు. ఈ నేపధ్యంలో ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న ట్రైబర్ రైట్స్ ఫోరం చైర్మన్తో మాట్లాడారు. నిజమైన అర్హలకు తగిన న్యాయం చేస్తామని అందుకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఎకలవ్య నగర్లో ఉన్నటు వంటి వారి పూర్తి పరిస్థితిని పూర్వ రెవిన్యూ అధికారుల నివేదికలను పరిశీలించారు. అనంతరం ఎకలవ్య నగర్ ను సందర్శించారు. తహసీల్దార్ సంజీవ రావు, డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.

