తాళ్లూరులోని ముండ్లమూరు వెళ్లే మార్గంలో ఓవృద్దునిపై డాబా ప్రహరీగోడ కూలి తీవ్రగాయాలపాలై గత 15రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమో దయింది. గ్రామస్తుల కథనం మేరకు …ముండ్లమూరు వెళ్లే మార్గంలో కోట వెంకట సుబ్బారెడ్డి(72) నివాస ముంటున్నాడు. నిత్యం ఇంటి బయట నిద్రిస్తుండేవాడు. గత నెల 22వ తేదీ ఆరుబయట నిద్రిస్తున్న సుబ్బారెడ్డిపై ఇంటి డాబా ప్రహరీగోడ కూలి పడింది. ఆమార్గంలో వెళుతున్న పెద్ద వాహనంకు విద్యుత్తు తీగ తగిలి బలంగా ముందుకు వెళ్లటంతో డాబాకు ఏర్పాటు చేసిన ప్రహరీగోడ విరిగి నిద్రిస్తున్న వ్యక్తి తలపై, ఉదర భాగంపై పడింది. దీంతో సుబ్బారెడ్డి గుండెబాగం, ప్రక్కటెముకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుబ్బారెడ్డి పరిస్థితివిషమంగా వుండటంతో ఒంగోలు లోని ప్రవేటు వైద్యశాలలో చికిత్స పొందాడు.
వాహనం వల్ల ప్రమాధం జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. గత రెండు రోజులుగా సుబ్బారెడ్డి ఆ రోగ్య పరిస్థితి పూర్తిగా విషమించటంతో ఒంగోలు రిమ్స్ నందు చేర్పించి చికిత్స చేయిస్తుండగాసోమవారం మద్యాహ్నం మృతి చెందాడు. దీంతో పోలీసులు ప్రమాదం మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుబ్బారెడ్డి కుమారుడు కోట రామి రెడ్డి తాళ్లూరులో టీడీపీ బలమైన కార్యకర్తగా కొనసాగుతున్నాడు.
డాబా ప్రహరీగోడ పైన పడి గాయాలపాలై చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి
07
Apr