గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

జిల్లాలో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ఎంపిడిఓలను, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి, గృహ నిర్మాణాల పురోగతి, జాతీయ ఉపాధి హామీ పధకం అమలు, వర్క్ ఫ్రమ్ హోం సర్వే,సీ జిఎస్డబ్ల్యుఎస్, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, పోషణ్ పక్వాడా కార్యక్రమం అమలు, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు, గ్రామ పంచాయతీల వర్గీకరణ సర్వే , జియో కో ఆర్డినేట్స్ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …..
రానున్న మే, 31 వతేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 8 వేల 839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనీ లక్ష్యానికి గాను ఇంతవరకు కేవలం 2 వేల 664 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి అయ్యిందని, ప్రస్తుత వేసవిలో ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కావున ఇంజనీరింగ్ సిబ్బంది వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన లబ్దిదారులకు అందించే అదనపు ఆర్ధిక సహాయంపై, మరియు ప్రభుత్వం ఉచితంగా అందించే ఇసుక, రాయితీపై అందించే సిమెంట్, నిర్మాణ సామాగ్రి, తదితర విషయాలపై లబ్దిదారులకు అవగాహన కలిగించి, ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం అయ్యేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యక శ్రద్ద తీసుకోవాలన్నారు. లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని నిర్దేశించిన సమయంలో లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. జన్ మన్ కార్యక్రమం కింద చేపట్టే గృహ నిర్మాణాలను త్వరగా పూర్తీ చేసేలా సంబంధిత మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
జిల్లాలో పిల్లలు మరియు మహిళల పోషకాహార స్థితిలో మెరుగుదల సాధించడానికి ఈ నెల 8వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని రోజుకు ఒక కార్యక్రమంతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం బేబి పుట్టిన తరువాత మొదటి 1000 రోజులపై దృష్టి పెట్టడం, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కౌమారదశలో ఉన్న బాలికలు మరియు 06 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోషకాహార ఫలితాలను మెరుగుపరచడమని కలెక్టర్ తెలిపారు. ఐసిడిఎస్., విద్య, హెల్త్, ఎంపీడిఓలు, మునిసిపల్ కమీషనర్లు సమన్వయంతో పనిచేసి ప్రజలను భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా రాబోవు మూడు నెలలకు సంబందించి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఫారం పాండ్ల నిర్మాణం పూర్తి చేయుటకు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,500 ఫారం పాండ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా ఈ వారం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఫారం పాండ్ నిర్మాణం పూర్తీ చేసేలా ఫీల్డ్ అసిస్టెంట్స్ కృషి చేయాలన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించాలన్నారు. జిల్లా లో ఏప్రిల్, మే నెలలో మూగ జీవాలకు త్రాగు నీరు అందించాల్సిన భాద్యత మనపై ఉందని, అందులో భాగంగా పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టుటకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. పనులు జరుగు ప్రదేశాల్లో త్రాగునీరు, షేడ్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ ఎస్ ప్యాకెట్స్ సిద్దంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేసారు. సగటు కనీస వేతనం రోజుకు 300 రూపాయలు తగ్గకుండా ఉండేలా ఫీల్డ్ అసిస్టెంట్స్ వేజ్ సీకర్స్కు అవగాహన కల్పించి పనులు చేయించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. డిఎల్డిఓ లు, ఎంపిడిఓ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వర్క్ ఫ్రమ్ హోం సర్వే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, డ్వామా పిడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్. ఎస్ఈ శ్రీ బాల శంకర రావు, సిపిఓ శ్రీ వేంకటేశ్వర రావు, పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓ లు, ఎంపిడిఓ లు, ఈఓ పిఆర్డిలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *