ఒంగోలు లోని డి.ఆర్.ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుచున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. ఈ నెల 3వ తేదీ నుండి మూల్యాంకన ప్రక్రియ జరుగుచున్నది. చీఫ్ ఎగ్జామినర్లు 113 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 680 మంది, స్పెషల్ అసిటెంట్లు 226 మంది, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్స్ 9 మంది మొత్తం 1,028 పరీక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. వీరు సుమారు 1,78,218 విద్యార్థుల పేపర్లు దిద్దాల్సివుంటుంది. స్పాట్ వాల్యుయేషన్ లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వారికి తగిన సదుపాయాలను కల్పించాలని అలాగే మూల్యాంకన ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ కిరణ్ కుమార్, ఎగ్జామ్స్ ఏసీ శివ కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు.





