బేగంపేట విమానాశ్రయంలో మంగళవారం టీజీఎస్ పి ఎఫ్ డీజీపీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు యశోద ఆసుపత్రి సహకారంతో సిపిఆర్, బి ఎల్ ఎస్ లపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సమయంలో సిబ్బంది చేయాల్సిన సి పీ ఆర్ బి ఎల్ ఎస్ లపై డెమో ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం కమాండెంట్ పిఎస్ రావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏ సి రంజిత్, సిఐలు మహేందర్, అశోక్ ,ఎస్సైలు ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


