రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పిజిఆర్ఎస్ పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం రెవెన్యూ సదస్సుల పిజిఆర్ఎస్, రీసర్వే, ఐవిఆర్ఎస్ ఫీడ్ బ్యాక్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సిసిఎల్ఎ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ…. జిల్లాల్లో రీసర్వే ప్రక్రియ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పిజిఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఎలోపు వెళ్లకుండా గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. మూడవ కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ సమస్యలు బాగా పరిష్కారం అవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. రీసర్వే సమస్యలు, సిటిజన్స్ సర్వీసెస్, పిజిఆర్ఎస్ పరిష్కారంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమైనదని, ఆయా దరఖాస్తులను, సమస్యలను పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. గ్రామా స్థాయిలో వాటర్ ట్యాక్స్ వసూలు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.

