పి – 4 తోనే పేదరిక నిర్మూలన సాధ్యం-సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారు -దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే -రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు -డెహ్రడూన్ లో జరిగిన చింతన్ శివిర్ సమావేశంలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి

పి – 4 తోనే పేదరిక నిర్మూలన సాధ్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజన్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో రెండు రోజుల పాటు చింతన్ శివిర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి రెండవ రోజు సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న పి – 4 పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ ని ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు. ప్రజెంటేషన్ అనంతరం మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ తో ఏపీలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారు. విజన్ 2047 లో భాగంగా ఉగాది నాడు పి – 4 పథకం ప్రారంభించి పేదలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. సమాజంలో 10 శాతం ఉన్న ధనవంతులు 20 ఉన్న పేదల అభివృద్ధికి సహకరించాలని… రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చి ఈగల్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల నుంచి రూ.15 వేలు ఫించన్ అందిస్తున్నామని అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అనుసంధానంతో పారిశుద్ధ్య నిర్వహణను మిషన్ల ద్వారా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం పీఎంఏవై కింద ఇచ్చే దానికి అదనంగా ఎస్టీలకు రూ. 75 వేలు, ఎస్సిలకు రూ. 50 వేలు ఏపీలో కూటమి ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. పీఎం ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గ్రామానికి ఇస్తున్న రూ. 21 లక్షల్ని రూ.75 లక్షలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. పుట్టుకతోనే పిల్లల్లో ఆటిజం, వినికిడి లోపాలు గుర్తించేందుకు ప్రత్యేక పరికరాల్ని ప్రతి మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహకారం తీసుకోవాలని అన్నారు. వృద్దులకు, ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు ఇస్తున్నా మని…వృద్ధుల కోసం అన్ని జిల్లాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ. 143 కోట్లతో సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు చేయిస్తున్నామని, ఎస్సి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మంత్రి డోలా ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *