వాడ వాడ లా హనుమత్ జయంతి వేడుకలు…….సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని పూజలు…….

బేగంపేట ఏప్రిల్ 12(జే ఎస్ డి ఎం న్యూస్):
వాడ వాడలా హనుమాన్ జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలు, వివిధ ప్రాంతాలలో నిర్వహించిన పూజలలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పూజల అనంతరం నిర్వహకులు శాలువాలు, పూలమాలలతో తలసానిని ఘనంగా సత్కరించారు.
బన్సీలాల్ పేట డివిజన్ లో…..
డివిజన్ లోని భోలక్ పూర్ లో శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే తలసాని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బన్సీలాల్ పేట వ్యాయామ శాల వద్ద, జబ్బార్ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్, సతీష్, రవి, శ్యాం, రామకృష్ణ, సాయి తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మోండా డివిజన్ లో…..
డివిజన్ లోని మార్కెట్ లో గల శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఆలయ ఈ ఓ అన్నారావు, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు నాగులు, రాములు, సత్యనారాయణ, జయరాజ్,
బేగంపేట డివిజన్ లో….
డివిజన్ లోని పీ జీ రోడ్డు లో గల హనుమాన్ దేవాలయం, బేగంపేట లోని కేసరి హనుమాన్ దేవాలయంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఎమ్మెల్యే ను సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి, నాయకులు శ్రీ హరి, నరేందర్ రావు, ఆరిఫ్, ఆలయ కమిటీ సభ్యులు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
అమీర్ పేట డివిజన్ లో….
డివిజన్ లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద గల హనుమాన్ దేవాలయంను దర్శించుకొని హనుమాన్ జయంతి, నూతన విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అదేవిధంగా బల్కంపేట లోని హనుమాన్ వ్యాయామ శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు హన్మంతరావు, కొలన్ బాల్ రెడ్డి, నాయకులు అశోక్ యాదవ్, సంతోష్ మణి కుమార్, కూతురు నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, పియూష్ గుప్తా, రాం నివాస్ బన్సాలీ, బలరాం, బాసా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ లో….డివిజన్ లోని ఉదయ్ నగర్, భగత్ సింగ్ గ్రౌండ్, జెక్ కాలనీ నల్లపోచమ్మ ఆలయాల వద్ద నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమాలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ ఎస్ ఐ హాస్పిటల్ ఆవరణలో అభయాంజనేయ, గణపతి, నాగ శివలింగ విగ్రహ ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బి ఆర్ ఎస్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు శేఖర్, సురేష్ గౌడ్, సంతోష్ మణి కుమార్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, షాబాద్ శ్రీనివాస్, శేఖర్, మధు, ఖలీల్, జమీర్, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.
రాంగోపాల్ పేట డివిజన్ లో….
డివిజన్ లోని ఓల్డ్ బోయగూడ ఫ్రెండ్స్ అసోసియేషన్, సుబాష్ రోడ్ లో గోల్డెన్ బ్యాంగిల్ స్టోర్, స్నేహిత వ్యాయామ శాల, రంగ్రీజ్ బజార్ ఫ్రెండ్స్ అసోసియేషన్, బీహార్ సమాజ్, చంద్రప్రకాష్ శర్మ, పాన్ బజార్, నల్లగుట్ట, కాచిబౌలి బాలక్ హనుమాన్ దేవాలయం, గైదన్ బాగ్ ఆంజనేయస్వామి ఆలయం F లైన్, చుట్టాల బస్తీ వ్యాయామ శాలలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, గణేష్, ఆనంద్ పాటిల్, రాం మోహన్ యాదవ్, మహేష్ యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *