(జె. ఏస్ డి. ఎం న్యూస్ ) బేగంపేట ఏప్రిల్ 13 :
హనుమాన్ జయంతినీ పురస్కరించుకుని ఏఐసీసీ సభ్యురాలు, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ బేగంపేట, సింధీ కాలనీలోని వీర హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి దివ్య ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అదే వేదికలో విశాల్ సుదాం ఆధ్వర్యంలో నిర్వహించబడిన హనుమాన్ చాలీసా భజన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ భక్తి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారితో కలిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం , నర్సింగ్ రావు,గంటా సుదీర్, త్రికాల శ్రీనివాస్ ,జాన్, పి.ఎల్. కృష్ణ, వి. చిరంజీవి, రాధా, మాదవి, మనోజ్ కుమార్, మోహిత్ బీసా, కృష్ణ, భీమ్ మరియు బాలా పాల్గొని హనుమాన్ జయంతిని ఆధ్యాత్మికంగా జరిపారు.
