బేగంపేట ఏప్రిల్ 14(జే ఎస్ డి ఎం న్యూస్) :
డా. బి.ఆర్. అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని రాంగోపాల్ పేట కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. నవచైతన్య దళిత సంఘం అధ్యక్షులు ఎస్ ఆర్ మల్లేశ్ ఆధ్వర్యంలో, విక్టోరియా రాణిగంజ్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీరా సుచిత్ర , ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ చీర శ్రీకాంత్ , డివిజన్ ప్రెసిడెంట్ సందీప్ వర్మ , మాజీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ వ్యాస్, డివిజన్ ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ నిర్మల మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
