అంబేద్కర్ కు నివాళులు అర్పించిన కోట నీలిమ….

రాంగోపాల్ పేట ఏప్రిల్ 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విక్టోరియా రాణిగంజ్ సర్కిల్ వద్ద సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమసమాజ స్థాపనకు కృషిచేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా రాణిగంజ్ బస్తీ అధ్యక్షుడు మల్లేష్ , సనత్ నగర్ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ , డిసిసి సెక్రెటరీ హేమంత్ ఠాగూర్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుదం , సనత్ నగర్ నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ , సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ జిఎల్ రమేష్ బాబు , గంట సుధీర్ , డాక్టర్ శివ లాల్ , ఎస్ ఆర్ శివకుమార్, సదనంద్ , నాగరాజ్ , మహేష్ మరియు సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *