బేగంపేట ఏప్రిల్ 14జేఎస్ డి ఎం న్యూస్ ) :
దళితుల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సనత్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బేగంపేట పాటిగడ్డలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం ,గౌరపల్లి రమేష్ తదితరులతో కలిసి నీలిమ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధాం, గోరపల్లి రమేష్, జగదీష్, కృష్ణ, హనీఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

