ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది………మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ హత్యపై మరోసారి టి డి పి కుట్ర బయట పడింది….రాయ చోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.

సోమాజి గూడ ఏప్రిల్ 14(జేఎస్డిఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి.) :
ఆంధ్ర ప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని
రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సోమాజీ గూడప్రెస్ క్లబ్ లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ
మాజీ ముఖ్యమంత్రి , ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో ముందస్తు ప్రణాళిక తో అత్యా యత్నం చేశారన్నారు.
జగన్ హత్య పై మరోసారి టీడీపీ కుట్ర బయట పడిందన్నారు.జగన్ మోహన్ రెడ్డి పై హత్య కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారన్నారు.మాజీ డిజి ,మాజీ ఐ పి ఎస్ అధికారి వెంకటేశ్వర్ రావు దాడి చేసిన వ్యక్తి ఇంటికీ వెళ్లడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.ఇది సమంజసమా అని అన్నారు.జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గతంలో జగన్ హత్య మిస్ అయ్యింది. ఈసారి పక్క ప్రణాళికతో అంతం చేయడానికిప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు.ఇటీవల జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతను చుస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
ఎన్ ఐ ఏ ఛార్జ్ సిట్ లో క్లియర్ గ అటాక్ అని , ఫ్రీ మర్డర్ ప్లాన్ చేసారు అని ఎన్ ఐ ఏ చెప్పిందన్నారు.గతంలో టెక్నాలజీ నీ ఉపయోగించి వై సి పి ఎమ్మెల్యేల ఫోన్లను వెంకటేశ్వర రావు ట్యాపింగ్ చేశారనీ ఆరోపించారు.జగన్ రెడ్డి పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ద్వేషం పెట్టుకొని ఏ బి వెంకటేశ్వర్ రావ్ హత్య ప్రయత్నం చేసిన వ్యకితో మంతనాలు చేస్తున్నారన్నారు.
వివేకా హత్య కేసులో ఎలా చంపామో చెప్పిన వ్యక్తికీ బెయిల్ తో బయట తిప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.మేమె చంపాము అని చంపిన వాళ్ళే చెప్పితే అందులో ప్రమేయం లేని వారిని ఇరికించే ప్రయత్నo చేస్తున్నారన్నారు.అంబెడ్కర్ ఆశయాలను నెమరువేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి పాలన చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *