Srinivasa Reddy:
వైభవంగా గుంటిగంగ తిరునాళ్ల
-గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ తిరునాళ్ల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. గతంలో కంటే అధిక సంఖ్యలో ఈ పర్యాయం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎండోమెంట్ అధికారులు అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా బారీ కేడ్లు ఏర్పాటు చేసి క్యూలో భక్తులుఅమ్మవారిని దర్శించుకునేందుకు వసతులు కల్పించారు. అమ్మవారికి పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ కావటంతో అధికసంఖ్యలో మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.
పొంగళ్లు పెట్టేందుకు ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేసిన గదులు సరిపోక ఆలయం వెనక భాగంలో, పలు చెట్టకింద పొంగళ్లు పెట్టుకుంటూ ఎండవేడిమికి కొంత మేర ఇబ్బందులు పడ్డారు. వేలాదిమందిగా వచ్చిన భక్తులు తమ మొక్కుబడులుగా గంగమ్మకు పశుజాతిని బలిఇచ్చి ఈ ఏడు కరువు నుండి ప్రజల్ని కాపాడాలని, సకాలంలో వర్షాలు కురిపించి కాపాడు గంగమ్మతల్లి అంటూ వేడుకున్నారు. భక్తులు పశుసంపదను, వాహనాలను తీసుక వచ్చి అమ్మవారి చూట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు జరిపారు. గంగమ్మగుడి ప్రక్కనున్న నాగదేవత స్వామికి, కృష్ణమందిరం, శివాలయాల
ను దర్శించుకుని పూజలు జరిపారు. తిరునాళ్ల సందర్భముగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకోసం ఆయా సామాజిక వర్గాలకు చెందిన అన్నదాన పత్రాల వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. దర్శి డిఎస్పీ లక్ష్మీనా యణ పర్యవేక్షణలో దర్శి సిఐ వై.రామారావు నేతృత్వంలో ఎస్ఐ ఎస్.మల్లిఖార్జు నరావువు, పోలీసులు తిరునాళ్లలో పటిష్ట పోలీసు బంధోభస్తు ఏర్పాటు చేశారు. బందో బస్తుకు నియమించిన పోలీసుల విధి నిర్వహణ సక్రమంగా లేక పోవటం వల్ల ఉదయం వేళనే ట్రాఫిక్ కు అంతరాయం జరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆలయం వద్ద నియమించిన పోలీసులు కన్పించక పోవటం, స్థానికులం, ముఖ్యుల మంటూ వెలుపలికి వెళ్లే మార్గం గుండా అధికసంఖ్యలో భక్తులను ఈ పర్యాయం ఆలయం లోకి అనుమతించటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయంలోనుం డి బయటకురాలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నా పోలీసులు, ఎండోమెంట్ అధి కారులు మిన్నకుండిపోయారు. క్యూలో నిల్చున్న భక్తులు గంటల కొద్దినిల్చుని ఇబ్బందులు పడ్డారు. క్యూలో నిల్చున్న భక్తులకు మంచినీరు అందక దాహర్తితో తల్లడిల్లారు.
తిరునాళ్ల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలీసులు పికెట్ వద్ద అందుబాటులో వుండి దొంగలపై, అనుమానితులపై దృష్టిసారించి ముందస్తుగా. అదుపులోని తీసుకున్నారు. తిరునాళ్లలకు వచ్చిన భక్తులకు తేజా వృద్ధాశ్రమం వారు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు.
గంగమ్మతల్లికి ప్రత్యేకపూజలు చేసిన
జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి , పార్లమెంటు ఇన్చార్జి చెవి రెడ్డి, దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి..
జడ్పీచైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్లమెంటు ఇన్చార్జి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లుదర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి, దర్శించుకున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. దేవదాయశాఖ అధికారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి వెంట ఎంపీపీ తాటికొండ శ్రీను,టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్ రెడ్డి, టీడీపీ నేతలు శాగంకొండారెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, మన్నేపల్లి సమర, రాచకొండ వెంకట్రావు, పిన్నిక రమేష్, వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి వెంట మండల వైసీపీ అధ్యక్షులు టీసుబ్బారెడ్డి, మాజీఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




