సమ సమాజ స్థాపక కోసం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి చేసారని వక్తలు కొనియాడారు. తాళ్లూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అండేడ్కర్ 134వ జయంతి ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాంలో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి ఆయన గొప్పదనాన్ని వక్తలు కొనియాడారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎంపీడీఓ దార హనుమంత రావు, ఎంఈఓ సుబ్బయ్య టిడిపి నాయకులు శాగం కొండా రెడ్డి, వెంకట రావు, గొంది రమణా రెడ్డి (సమర), ఐ శ్రీనివాస రెడ్డి, జి వేణుబాబు, రాజు, ఎంపీటీసీ బాల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

