బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ఏ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాలు సందర్భంగా బుదవారం కనిగిరి ఎంపిడిఓ కార్యాలయంలో గర్భవతులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, ఎంపిపి ప్రకాశం, ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ….. జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్న 7వ పౌష్టికాహార పక్షోత్సవాల్లో (పోషణ్ పఖ్వాడా) బాగంగా ఈ రోజు “మాతా శిశు సుఖీభవ” సామూహిక శ్రీమంతం వేడుకలు నిర్వహించడం, తల్లిపాలు పై అవగాహన మరియు కౌన్సెలింగ్ ఇవ్వడం, సెక్రటేరియట్ స్థాయిలో విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ డే నిర్వహించడం జరుగుచున్నదన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మొదటి 1000 రోజుల (గర్భస్త దశ నుండి 2 సంవత్సరాల వరకు సంరక్షణపై శ్రద్ధ వహించుట, గర్భిణీ తల్లికి హిమోగ్లోబిస్ స్థాయిని మెరుగుపరచడం, గర్భిణీ తల్లి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడం, తల్లి మరియు బిడ్డను కాపాడటానికి కుటుంబం మరియు సమాజం నుండి మద్దతును నిర్ధారించడం, మెరుగైన పోషకాహారం మరియు సకాలంలో టీకాలు వేయడం, తల్లి మరియు శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శిశువు మరియు చిన్న పిల్లలకు పౌష్టికాహార పద్ధతులపై తల్లి మరియు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం మన్నారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరుగుచున్నవని, జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టుటకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. నేడు ప్రవేటు వైద్యశాలల్లో కంటే ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుచున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

స్థానిక శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ…… మన బిడ్డల భవిష్యత్ బాగుండాలని బంగారు బాల్యం పేరుతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ గర్భవతులు, బాలింతలు ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు.

ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ….. ఆడబిడ్డలకు గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం అయ్యేంత వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా ఆనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు. బిడ్డ పుట్టిన మొదటి రోజు నుండి మంచి పౌష్టకాహారం తీసుకుంటూ, వైద్యుల సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఆరోగ్యమైన బిడ్డలను సమాజానికి అందించాల్సిన భాధ్యత ప్రతి తల్లి పై ఉందన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ , స్థానిక శాసన సభ్యులు గర్బవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.

తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు ఐసిడిఎస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *