ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు, డ్రాప్ అవుట్లపై ప్రత్యేక శ్రర్థ వహించి పాఠశాలలో నమోదు కార్య క్రమాన్ని విజయవంతం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య కోరారు. మండలంలోని తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు క్లస్టర్ కాంప్లెక్స్ లలో గురువారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వేల్ఫేర్ అసిస్టెంట్స్, మహిళా పోలీనులు, అంగన్ వాడీ టీచర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల విద్యాశాఖాధికారి -1 గురి జాడ నుబ్బయ్య, ఎంఈఓ -2 ముఖ్య అతిథులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు, మధ్యలో బడి మానివేసిన పిల్లలు (డ్రాప్ అవుట్స్) ను తిరిగి పాఠశాలల్లో చేర్చించేందుకు తీసుకోవలసిన పద్ధతులు, వారిని కౌల్సిలింగ్ చేయు విధానంపై అవగాహన కల్పించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్ శేష గిరి, అరుణ కుమారి, కరీమ్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

