అకాల వర్షాలు గాలుల ప్రభావంతో మండలంలో దెబ్బతిన్న పలు పంటలను వ్యవసాయాధికారి బి ప్రసాద రావు గురువారం పరిశీలించారు. మండలంలోని మాధవరం, కొత్త పాలెం, మన్నేపల్లి, తాళ్లూరు, కొర్ర పాటి వారి పాలెం గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో 4 గ్రామాలలో 21 మంది రైతుల పొలాలో 9 ఎకరాలలో వరి, 59 ఎకరాలలో మొక్కజొన్న, కోత దశలో ఉన్నవి దెబ్బతిన్నట్లు అంచానా వేసి జిల్లా వ్యవసాయాధికారికి నివేదించినట్లు చెప్పారు. అయితే కోత దశతో పాటు, కంకి దశలో ఉన్న మొక్కజొన్న దెబ్బతినటంతో తాము తీ వ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

