స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర విజయవంతం చేయండి -జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో ” ఈ – చెక్ ” ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా చెప్పారు. ప్రతినెలా
మూడో శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 19 న చేపట్టే కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలలోనూ, ప్రజల వద్ద ఉన్న ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే విధానము, నిర్వహణపై
అవగాహన కల్పించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ కేంద్రాలకు వీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్ఓ బి. చిన ఓబులేసు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *