చైత్ర శుద్ధ నవమి, మంగళవారం, ఏప్రిల్ 22న శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీగిరిపై కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి శ్రీవారి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం రోజున సామూహిక శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుందని కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు. ఉదయం 5 గంటలకు ఒంగోలు నగరంలోని శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోసంరక్షణ శాల గోశాలలో గోపూజ నిర్వహించి శ్రీవారి ఉత్సవ మూర్తిని తమ భుజస్కంధాలపై పెట్టుకుని భక్తులు సామూహికంగా గోవింద నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణకు బయలుదేరడం జరుగుతుందని తెలిపారు.
ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం 2023 వ సంవత్సరం ఆగస్టు 29న ప్రారంభించి ప్రతి 27 రోజులకు వచ్చే శ్రవణా నక్షత్రం రోజున భక్తి శ్రద్దలతో, సంప్రదాయబద్దంగా శ్రీగిరి గిరిప్రదక్షిణ చేయుచున్నామని వివరించారు.
హిందూ బంధువులు బంధుమిత్ర సమేతముగా శ్రీగిరి గిరిప్రదక్షిణకు వందలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించి శ్రీవారి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
