తాళ్లూరు మండలంలోని పలుగ్రామాల్లో చర్చిల
వద్ద గుడైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు,దోసకాయల పాడు, శివరాంపురం,నాగంబొట్లపాలెం, రమణాలవారిపాలెం, తూర్పుగంగవరం, లక్కవరం, వెలుగువారిపాలెం, విఠలాపురం తదితర గ్రామాల్లో చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. తాళ్లూరు చర్చిలో పాస్టర్ ప్రభుదాసులు ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. పాస్టర్లు మాట్లాడుతూ యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటలను విశ్వాసులకు వివరించారు. యేసుక్రీస్తు మానవాలి పాప పరిహారం నిమిత్తం సిలువలో. ప్రాణం పెట్టానని, యేసు ప్రభువును నమ్ముకుంటే రక్షణ కలుగుతుందని వివ రిస్తూ ప్రార్థనలు చేశారు. ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వాసులు హజరై యేసును ప్రార్థించారు.

