హైదరాబాద్ ఏప్రిల్ 21 :
హైదరాబాద్ జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైందనీ అధ్యక్షులు అల్లం నారాయణ ,ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు ప్రకటించారు.నూతన కార్యవర్గాన్ని సభ్యుల ఏకగ్రీవ ఆమోదం మేరకు రాష్ట్ర కమిటీగా ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా సి.హెచ్ .రాకేష్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా ఎం .మల్లేష్, వి.అజయ్,సువర్ణ ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్వర్ ,సంయుక్త కార్యదర్శులుగా రమేష్,ఆర్.ప్రవీణ్ కుమార్ కార్య నిర్వహణ కార్యదర్శులుగా రామడుగు వెంకట్, ఎస్. వెంకట్ ,కోశాధికారిగా వి.బాపురావు,కార్యవర్గ సభ్యులుగా ఎస్.సంతోష్,రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి,హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి గా యార నవీన్ కుమార్ ఎన్నికైనట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

