కూటమి ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలలకు అండగా ఉంటు సమస్యలు పరిష్కరిస్తుంది – ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే దామచర్ల – ఘనంగా అప్స ( ఏపీ టిసీఏ) నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవం

ఏపీ లో విద్యా రంగాన్ని బలోపేతం,అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు.
సోమవారం స్థానిక యన్.టీ.ఆర్ కాలక్షేత్రంలో జరిగిన ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి అయన ముఖ్యఅతిథిగ పాల్గొని ప్రసంగిస్తూ నేడు విద్య పట్ల ప్రవేటు పాఠశాలలు కృషి ఎంతో అభినందనీయమని
ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు.అయితే గత ప్రభుత్వం ప్రవేటు పాఠశాలలను ఎన్నో రకాలా ఇబ్బందులకు గురిచేసిందని వాటిని ఈ ప్రభుత్వం పరిష్కరించే దిశగా పయనిస్తుందని అన్నారు. దీనిలో భాగంగా ఒకప్పుడు ప్రయివేట్ స్కూలు గుర్తింపు కాలపరిమితి పది సంవత్సరాలు ఉంటే వైసిపి ప్రభుత్వం మూడు సంవత్సరాలు చేసి తర్వాత ఎనిమిది సంవత్సరాలు చేసిందని దామచర్ల గుర్తుచేశారు.రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు ప్రవేటు పాఠశాలల సమస్యను గుర్తించి గుర్తింపు కాల పరిమితిని పది సంవత్సరాలకు పొడిగింపు ఇస్తాను అని మాటివ్వడంతోపాటు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న విద్యుత్ టారీఫ్ సమస్య , ఫైర్ సర్టిఫికెట్ సమస్య, ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులతో మాట్లాడి వాటికి అనుకూలమైన చర్యలు చేపట్టడానికి కృషి చేస్తుందని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దీనిలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తుందని అంతేకాకుండా నిరుద్యోగులకు వరంగా మారిన డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాల సమస్యలే కాకుండా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు .

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు యొక్క ఆలోచన అనుగుణంగా ఈ ప్రభుత్వం విద్యకు వైద్యానికి ప్రథమ పీఠాన్ని వేసిందని దానిలో భాగంగా విద్యరంగానికి ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కారానికి ఈ ప్రభుత్వం ముందుంటుందని అన్నారు.

ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్కిడ్స్ హై స్కూల్ కరస్పాండెంట్ గేరా అజయ్ కుమార్ మరియు జిల్లా కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన అపెక్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ శివకోటిరెడ్డి లను అభినందించి, రానున్న కాలంలో విద్యారంగ కృషికి మీ వంతు సహకారాన్ని అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు

నూతన అధ్యక్షులు జి. అజయ్ కుమార్, నూతన కార్యదర్శి అపెక్స్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కె. శివ కోటిరెడ్డి లకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.

హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుందర రామ్, రాష్ట్ర నాయకులు మాంటిసోరి ప్రకాష్, ఒంగోలు పట్టణ అధ్యక్షురాలు ఈ వి ఎస్ లక్ష్మి, ఐపిపి జాలి రెడ్డి , మాజీ జిల్లా అధ్యక్షులు బొమ్మల శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, శివప్రసాద్, విజేత రమణ వివిధ వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *