అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఐటిసి వారు అందచేసిన అసెస్మెంట్ టూల్ కిట్, హబ్ అంగన్వాడీ మాడ్యూల్స్, పోస్టర్స్, బ్రోచర్స్, క్లాస్ మేనేజ్మెంట్ మెటీరియల్ ను సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ మెటీరియల్ ను జిల్లా లోని అన్నీ అంగన్వాడీ కేంద్రాలకు అందచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి హేన సుజన, ఐటిసి ప్రతినిధులు వెంకటలక్ష్మి, హరిణి, సార్డ్స్ ప్రతినిధులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

