బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండేలా తగిన విధంగా తల్లిదండ్రులనుప్రొత్సహించాలని మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య కోరారు. తాళ్లూరు మండలంలోని మూడు కాంప్లెక్స్ ల పరధిలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామాలలో విద్యార్థులను ప్రభుత్వ బడులలో చేర్చాలని తల్లిదండ్రులను కోరుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లూరు ఎస్సీ కాలనీలో ఎంఈఓ జి సుబ్బయ్య, న్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, హెచ్ఎంలు శేషగిరి, శ్రీనివాస రావులు, వేల్ఫేర్ అసిస్టెంట్ క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొని అంగన్ వాడీ చిన్నారులను పాఠశాలలోనికి ఎన్ రోల్ చేసారు. అదే విధంగా మండలంలోని సోమవారం 35 మంది విద్యార్థుల వరకు నమోదు అయినట్లు ఎంఈఓ తెలిపారు. ఆయా కార్యక్రమాలలో ఎంఈఓ -2 సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
