విద్యార్థులకు ఇంటర్న్ షిష్ సర్టిఫికేట్స్ తదుపరి విద్యా బ్యాసం, కేరియర్లో ఎంతోఉపయోగం ఉంటుందని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణ కుమారి అన్నారు. తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓకేషనల్ ఎడ్యుకేషన్, బ్యాకింగ్, హెల్త్ కేర్కు సంబంధించి దనరా, సంక్రాంతి సెలవులలో నిర్వహించిన ఇంటర్న్ షిమ్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్స్ను అందజేసారు. తూర్పుగంగవరం పిహెచ్సీ వైద్యాధికారి మౌనిక, ఎన్ ఎం సీ చైర్మన్ శంషాద్ బేగంలు ముఖ్య అతిథులుగా పాల్గొని నర్టిఫికేట్స్ అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగిరెడ్డి, ట్రైనర్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

