జిల్లా లో ఈ నెల 15వ తేదీ నుండి జరుగుచున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్ , శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా జరిగేలా మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి, వాట్సప్ గవర్నెన్స్ , శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు, జాతీయ ఉపాధి హామీ పధకం అమలు, జి.ఎస్.డబ్ల్యు.ఎస్ సర్వీసెస్, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్, శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 15 వ తేదీ నుండి సచివాలయాల పరిధిలో జరుగుచున్నదన్నారు. ఈ అవగాహన ప్రక్రియ క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయడం, ప్రభుత్వం రుపొందించిన బ్రోచర్ ను ప్రజలకు అందచేయడం తో పాటు వారి మొబైల్ ఫోన్ నందు సంబంధిత యాప్ లు డౌన్లోడ్ చేయడం జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో ప్రవేశ పెట్టిన వాట్సప్ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశ్యం ను దాని వలన కలుగు లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ అవగాహన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తీ చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పధకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించేలా క్షేత్ర స్థాయిలో ఎంపిడిఓ లు, ఎపిఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆదివారం జిల్లాలో పిడుగుపాటు వలన ఇద్దరు విద్యార్ధులు మరణించడం భాదకరమని, వర్షాకాలంలో ముఖ్యంగా మెరుపులు, పిడుగులు పడే అవకాశం వున్న సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డ్వామా పిడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్. ఎస్ఈ శ్రీ బాల శంకర రావు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి మునిసిపల్ కమీషనర్లు, డిఎల్.డి.ఓ లు, ఎంపిడిఓ లు, ఈఓ పిఆర్డిలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.

