బేగంపేట ఏప్రిల్ 22(జే ఎస్ డి ఎం న్యూస్) : సీఎం ప్రజావాణి పని తీరు బాగుందని, నాగాలాండ్
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కితాబు ఇచ్చారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో సీఎం ప్రజావాణిని నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం సందర్శించి ప్రజావాణి జరుగుతున్న తీరు తెన్నులను స్వయంగా పరిశీలించింది.
సీఎం ప్రజావాణి గురించి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లు వివరించారు.సీఎం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించడం, వాటిని ఆన్లైన్ లో సంబంధిత శాఖలకు పంపడం, డెస్క్ ఆఫీసర్స్ విధులు, హెల్ప్ డెస్క్, ఫిర్యాదుల ట్రాకింగ్ పని తీరు, తాగు నీటి సౌకర్యం, ప్రభుత్వం అందించే ఐదు రూపాయల భోజనం కేంద్రాన్ని కూడా నాగాలాండ్ అధికారుల బృందం పరిశీలించింది.
సీఎం ప్రజావాణి జరుగుతున్న విధానం చాలా బాగుంది.
అని నాగాలాండ్ బృందం కితాబునిచ్చింది. ఈ విధానాన్ని నాగాలాండ్ రాష్ట్రంలో అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.నాగాలాండ్ రాష్ట్ర ఉన్నత అధికారుల బృందంలో కుశ ఫితూ, విక్ వెనో చాలే, అవేలు రుహో, అత్ సంగ్లా, తదితరులు ఉన్నారు. వీరి వెంట ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ ప్రొఫెసర్ మాధవీ రావులపాటి కూడా ఉన్నారు.

