బేగంపేట్ ఏప్రిల్ 22: (జె ఎస్ డి ఎం న్యూస్)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి అధికారులు ఆన్లైన్లో ధరఖాస్తులు ఈ నెల 14 వరకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే సికింద్రాబాద్ మండలం పరిధిలో 7 వేల పై చిలుకు ఆన్లైన్లో ధరఖాస్తులు వచ్చాయని సికింద్రాబాద్ తహసిల్దార్ పాండు నాయక్ తెలిపారు. ఇలా ధరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు ఆయా పత్రాలు ఆన్లైన్లో ఏవైతే పొందు పరిచారో ఆ సర్టిఫికెట్లను ఆయా మున్సిపల్ పరిధిలోని వార్డ్ కార్యాలయాల్లో ఫిజికల్ గా పత్రాలను ఇవ్వాలని మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ లోపల పత్రాలు వార్డ్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారులకు అందజేయాలని సికింద్రాబాద్ తహసిల్దార్ పాండునాయక్| సూచించారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సికింద్రాబాద్ మండలం పరిధిలో 7 వేల పై చిలుకు ఆన్లైన్లో ధరఖాస్తులు – సికింద్రాబాద్ తహసిల్దార్ పాండు నాయక్
22
Apr