పొగాకు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.మంగళవారం ఉదయం ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, సంతనూతలపాడు శాసన సభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ తో కలిసిసందర్శించారు. ఈ సందర్బంగా పొగాకు కొనుగోళ్ల గురించి బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, ధరల గురించి రైతులు, రైతు సంఘ నాయకులతో మాట్లడారు. ఈ సందర్బంగా మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ, ఎక్కువగా నో బిడ్లు వస్తున్నాయని దీని వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని ఈ నేపథ్యంలో ఇక్కడ కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. లో గ్రేడ్ ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయని ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యల తీసుకుంటామన్నారు. నో బిడ్లు, ధరల గురించి కొనుగోలుదారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో కూడా ధరలు లేని పరిస్దితుల్లో తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందన్నారు. ఇప్పుడు కూడా రైతుల నష్టపోకుండా అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

