సనత్ నగర్ ఏప్రిల్ 23(జే ఎస్ డి ఎం న్యూస్):
కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారు, భక్తుల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. బుధవారం సీతాఫల్ మండి మధురా నగర్ లో గల శ్రీ బంగారు మైసమ్మ ఆలయ 9 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వల్పకాలంలోనే ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఇతర కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, ఆలయ అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రకాష్ రావు, ప్రమోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి ధనశేఖర్, మహేష్ నాయుడు, నాయకులు బాలరాజ్ యాదవ్, శైలేందర్, బాబూరావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





