హైదరాబాద్ ఏప్రిల్ 25 జే ఎస్ డి ఎం న్యూస్ :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 291 దరఖాస్తులు అందాయి.
వీటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 123, విద్యుత్ శాఖకు సంబంధించి 17, రెవెన్యూ శాఖకు సంబంధించి 38, ఇందిరమ్మ ఇండ్ల కోసం 61 దరఖాస్తులు వచ్చాయి. ప్రవాసి ప్రజావాణికి 01, ఇతర శాఖలకు సంబంధించి 51 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళలు, గిరిజన శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం ప్రజా భవన్ కు రాగా, వారి సమస్యలపై దివ్య దేవరాజన్ ప్రత్యేక దృష్టిని సారించారు.
సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
