ఉత్తమ స్థానిక నాయకత్వ సేవ పురష్కారాలను శుక్రవారం తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు అందుకున్నారు. నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ ఆంధ్ర ప్రదేశ్ గ్రామ స్వరాజ్య సాధన సమితి వారి ఆధ్వర్యంలో జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవములను పురష్కరించుకుని ఉత్తమ స్థానిక నాయకత్వ సేవ పురష్కారాలు అందజేసారు. ఈ నేపధ్యంలో తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఉత్తమ పురష్కార అవార్డులు అందుకున్న ఎంపీపీ, జెడ్పీటీసీలను స్థానిక ప్రజా ప్రతినిథులు, పలు పార్టీల నేతలు అభినందనలు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ఎంపీపీ, జెడ్పీటీసీలు తీసుకుంటున్న చొరవ అభినందనీయమని అన్నారు.


