బిజెపి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. స్థానిక సంస్థలను బలహీన పరుస్తుంది….. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్….

కంటోన్మెంట్ మే 3 (జేఎస్ డి ఎం న్యూస్) :
బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని స్థానిక సంస్థలను బలహీన పరుస్తుందని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. శనివారం కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని వార్డు టు రసూల్పురాలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ర్యాలీ రసూల్ పుర గాంధీ విగ్రహం నుంచి మొదలై కంగల్ చౌరస్తా జగదీష్ నగర్ కాలనీ నారాయణ జోపిడి, ఇందిరమ్మ నగర్ బీరప్ప టెంపుల్ అర్జున్ నగర్ మీదుగా అన్నానగర్ అంబేద్కర్ విగ్రహం వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర ద్వారా బిజెపి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వర్సిల్లో ప్రజలకు వివరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *