హైదరాబాద్ మే 4 (జేఎస్ డి ఎం న్యూస్ తెలంగాణ ప్రధాన ప్రతినిధి)
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తాసిల్దారులు నాయబ్ తాసిల్దారులను పూర్వ జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలని ప్రెస్సా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.ఆదివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, లో తెలంగాణ ఉద్యోగ,గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక & పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ అధ్వర్యంలో ట్రెసా ప్రతినిధి బృందం ఈ సదస్సులో పాల్గొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారుల ఉపాధ్యాయులు, కార్మికులు & పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీలో చర్చించారు.ఈ సదస్సులో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె .గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు బదిలీలు జరగక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని,కామారెడ్డి జిల్లాలో విజయ్ కుమార్ అనే తహశీల్దార్ ఎన్నికల బదిలీ జరగక తీవ్ర ఆందోళనతో చనిపోయారని, మరియు నారాయణ పేట్ జిల్లాలో మల్లికార్జున్ రావు అనే తహశీల్దార్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబానికి దూరంగా ఉండి వృద్ధాప్యంలో, అనారోగ్యంతో మంచం బారినపడిన కన్న తల్లిని చూసుకోలేక పోతున్నానని,ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని లేఖ రాయడం రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం లేపిందని సభదృష్టికితీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జె .ఎ.సి తో జరిగిన సమావేశంలో ఎన్నికల బదిలీలపై స్పష్టమైన హామీ ఇచ్చారని,ఆ హామీని అమలు చేయాల్సిన భాధ్యత ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బదిలీచేసినతహశీల్డార్లను,ఎంపీడీఓలను అలాగే డిప్యూటీ తహసీల్దార్లను స్థానిక జిల్లాతో పాటు పూర్వ జిల్లాలకు తిరిగి పంపించాలని,ఈ మేరకు తీర్మానం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
పరీక్షలతో సంబంధం లేకుండా మరియు సీనియారిటీ కోల్పోకుండా ఇతర శాఖలకు కేటాయించిన వీఆర్వోఓ లను రెవెన్యూ శాఖలోకి తిరిగి తీసుకోవాలని తీర్మానించాలని కోరారు.అలాగే వి ఆర్ ఏ ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా జె. ఎ.సి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తూ ఈ క్రింది ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించారు.
1.సార్వత్రికఎన్నికలసందర్భంగా బదిలీ చేసిన తహసిల్దార్లు,ఎం.పి డి.ఓ ల తో సహా 6 శాఖల ఉద్యోగులనుతిరిగి పూర్వ స్థానాలకు పంపించాలన్నారు.2. పెండింగ్ లో ఉన్న 5 డి ఏ లను వెంటనే విడుదల చేయాలి.. యుద్ద ప్రాతిపదికన పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలి. పి ఆర్ సి కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51 % ఫిట్మెంట్ను వెంటనే అమలు చేయాలి.. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు (ఈ హెచ్ఎస్) వెంటనే పూర్తిస్థాయిలోఅమలుచేయాలిజి.వో. 317 ను సమీక్షించి బాధితుల బదిలీల కొరకు సూపర్ న్యూమరీ పోస్టులను కల్పించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్థానిక జిల్లా/ జోనులను కేటాయించాలి.కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి (సి పి ఎస్ & యు పి ఎస్) పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా పునరుద్ధరించడం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్ రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగాధర్ , తహశీల్దార్లు వనజా రెడ్డి,అయ్యప్ప , కాళిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
