ప్రకృతి వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చెయ్యాలి

ప్రకృతిలోని ప్రతి వనరును ఉపయోగించుకుని నేలను సజీవంగా ఉంచి మంచి నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తూర్పుగంగవరం రైతు సేవా కేంద్రంలో మంగళవారం ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ -2025 ప్రణాళిక సిద్ధం చేయటానికి పొదుపు సంఘాలు, రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి సాగు మాస్టర్ ట్రైనర్ జె ప్రభాకర్ మాట్లాడుతూ 365 రోజులు భూమిని పచ్చని పంటలతో ఉంచేందుకు తగిన ప్రణాళికను వివరించారు. నవ ధాన్యాల కిట్ ను తీసుకుని వేసవిలో ముందుకు పొలంలో చల్లినట్లయితే తొలకరి వర్షాలకు మొలకెత్తి నేల సారవంతమౌతుందని చెప్పారు. ప్రకృతి సాగు మండల ఇన్చార్జి నరసింహులు మాట్లాడుతూ మహిళా సంఘాల విఓఏల ప్రతి ఒక్కరి సాగు వివరాలు అందులలో ప్రకృతి సాగు వివరాలను నమోదు చెయ్యాలని కోరారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐసీఆర్పీలు వాణి, రమేష్, రత్నం, అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భిన్న వాతావరణ పరిస్థితులలో పిడుగు పాటుకు, విద్యుత్ షాక్లకు గురికాటుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అందుకు గ్రామాలలో ప్రచారం విరివిగా నిర్వహించాలని గుడి, దేవాలయాలు, మసీదులతో మైక్ల ద్వారా ప్రజలకు అప్రమత్తం చెయ్యాలని వ్యవసాయాధికారి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *