సికింద్రాబాద్ మే 7, (జె ఎస్ డి ఎం న్యూస్) :
పహల్గమ్ ఉగ్రదాడికి సమాధానంగా జరిగిన ఆపరేషన్ “సిందూర్” భారతదేశ శక్తి సామర్థ్యాలను, మన త్రివధ దళాల పరాక్రమాన్ని ప్రపంచానికి చాటాయనీ, సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత సైన్యానికి మద్దతుగా దేశం మొత్తం అండగా నిలుస్తుందని వల్లారపు శ్రీనివాస్ పేర్కొన్నారు.
పహల్గమ్ లో అమానవీయంగా హిందువులను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘాతుకాన్ని భారతీయులెవరూ సహించరని, ఉగ్రస్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో చేపట్టిన గొప్ప ఆపరేషన్ గా వల్లారపు శ్రీనివాస్ అభివర్ణించారు.
పాకిస్తాన్ లో దాక్కున్న చివరి ఉగ్రవాదిని అంతమందించేదాకా ఈదాడిని భారత దేశం ఆపకూడదని ఆయన కోరారు.
