తాళ్లూరుః మండలంలోని పలు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలలో బ్రహ్మం గారి ఆరాధనోత్సవం ఘనంగా నిర్వహించారు. విఠలాపురంలో బ్రహ్మం గారి ఆలయం వద్ద వీర బ్రహ్మేంద్ర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. తహసీల్దార్ సంజీవరావు, ఎంపీడీఓ దార హనుమంతరావు, ఎస్సై మల్లిఖార్జున రావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి, సాగర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
