బేగంపేట మే 15 (జే ఎస్ డి ఎం న్యూస్)
ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ విజేతను హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముప్పిడి గోపాల్ ఘనంగా సత్కరించారు. బీహార్ రాజ్ గిరి లో జరిగిన కే లో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ లో కంటోన్మెంట్ కు చెందిన జె.సాయివర్ధన్ 89 కిలోల విభాగంలో 275 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పిడి గోపాల్ సాయి వర్ధన్ ను సత్కరించారు. తెలంగాణ నుండి ఎంపికైన ఏకైక అథ్లెట్ సాయి వర్ధన్ అని బంగారు పతకాన్ని గెలుచుకొని మన రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేశాడని ముప్పిడి అభినందించారు. సాయి వర్ధన్ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించనున్నట్లు ముప్పిడి గోపాల్ తెలియజేశారు. సాయి వర్ధాన్ని అభినందించిన వారిలో కార్యదర్శి శివకుమార్ శ్రీనివాస్ పి రాజు వేణుగోపాల్ రెడ్డి దర్గా రవి తదితరులు ఉన్నారు.

