సికింద్రాబాద్.మే 18(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజు థియేటర్ సమీపంలోని జెకె ఫర్నిచర్స్ దుకాణం వద్ద ఫుట్ పాత్ పై నివసిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తి గ్రానైట్ రాయితో తలపై బలంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న మహంకాళి పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. మృతదేహం పక్కనే గ్రానైట్ రాయి లభ్యమైనట్లు పోలీసులుతెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందా లేదా మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు హత్యకు గల కారణాలనుతెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు.క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.

