దర్శనాపురి నాటకళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన నాటిక పోటీలు మూడో రోజు ఆది వారం అందరినీ అలరించాయి. ఈ సందర్భం గా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైద రాబాద్ వారి “స్వేచ్ఛ నాటిక ఆకట్టుకుంది. అదేవిధంగా శ్రీకాకుళం వారి “ద్రౌపది” కూచి పూడి సంగీత నృత్యరూపకం చూపరులను
కట్టిపడేసింది. ఈ నాటికి పోటీలు దర్శనాపురి నాటకళాపరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు ఘనంగా జరిగాయి. చివరి రోజున బహుమతులు ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని బహుమతులు అందజేశారు. బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్
ట్రస్ట్ చీమకుర్తి వారి సౌజన్యంతో చివరి రోజు నాటికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కలవకోలను అనంత్, కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ రెడ్డి, వైస్ ఎం. పి. పి సోము దుర్గారెడ్డి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, డాక్టర్ ఎస్ఎం భాష, ధనిరెడ్డి వెంకట రెడ్డి, రంగారావు, దేవేందర్ రెడ్డి ,మోషే తదితరులు పాల్గొన్నారు.


