ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కోహిర్ లింగారెడ్డి – కార్మికుల హక్కులకై పోరాటం చేస్తా: కోహిర్ లింగారెడ్డి

హైదరాబాద్ మే 19 (జే ఎస్ డి ఎం న్యూస్) :
కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టియుసి ఫెడరేషన్ పని చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు డా.మురహరి బుద్దారం తెలిపారు.సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బత్తిని సుమన్ ఆధ్వరంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కోహిర్ లింగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కార్మికుల సమస్యల పై నిరంతరం పోరాటం చేయాలనీ సూచించారు. ఐఎన్టియుసి ఫెడరేషన్ నాయకులూ కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలలో,ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నకార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన తమ దృష్టికి తీసుకొనిరావాలని కోరారు. ఫెడరేషన్ నూతన కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన లింగారెడ్డిని ఆయన శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోహిర్ లింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కార్మికుల హక్కులకై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన పై నమ్మకంతో ఇంతటి గురుతర భాద్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడిఉంటానన్నారు.
ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా.మురహరి బుద్దారం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిని సుమన్ రాష్ట్ర కమిటీ నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు
కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా ,రాష్ట్ర నాయకులూ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *