కొండపిలో తిరంగా ర్యాలీ-ర్యాలీలో పాల్గొన్న మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరిగినయుద్ధంలో భారత సైనికులు చూపిన పోరాట స్పూర్తికి యావత్ దేశం గర్విస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రకాశం జిల్లా కొండపిలో ప్రభుత్వ భవన కాంప్లెక్స్ నుండి సీతారామ కళ్యాణమండపం వరకు భారీ జాతీయ జెండాతోతిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి డోలా బాల వీరాంజ నేయస్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ఉగ్రవాదం ప్రపంచానికి పెను విపత్తు, ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందే. పహాల్గంలో మన దేశ పౌరులపై జరిగిన ఉగ్రదాడికి బదులుగా ప్రధాని మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. యుద్ధంలో మన దేశ సైనికులు చూపిన పోరాట స్ఫూర్తికి యావత్ దేశం మొత్తం గర్విస్తోంది. యుద్దంలో మరణించిన అనంతపురం జిల్లాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *