ప్రజా పిర్యాదులకు త్వరిత పరిష్కారం చూపుటకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమమును జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ నిర్వహించారు. జిల్లాలో వివిధ గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి పిర్యాదుదారులు నేరుగా వచ్చి తమ తమ పిర్యాదులను వ్రాతపూర్వకంగా జిల్లా ఎస్పీ కి మరియు పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. అధికారులు వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.
అందిన ఆయా ఫిర్యాదుల గురించి సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆయా ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, త్వరితగతిన పరిష్కారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కొరకు పోలీసు స్టేషన్లు/కార్యాలయాలకు వచ్చు పిర్యాదుదారులతో పోలీసు అధికారులు మరియు సిబ్బంది మర్యాదగా వ్యవహరించి చట్ట పరిధిలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించారు.
కార్యక్రమంలో ఎస్బి డిఎస్పీ సురేష్ బాబు, మహిళా పియస్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు రజియా సుల్తాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

