అన్నీ ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ పనితీరు ప్రజా సేవల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
జిల్లా కలెక్టర్లకు సూచించారు.
సోమవారం సాయంత్రం విజయవాడ ఏపీ సచివాలయంలోని సి.ఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశమై స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్,యోగాంధ్ర -2025 క్యాంపెయిన్, కోర్టు సముదాయాలలో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి, ప్రభుత్వ పథకాలు సేవల ప్రజా స్పందనలు వంటి అంశాల పై సమీక్షించి దిశానిర్దేశం చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ… స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ కింద అమలు చేస్తున్న ప్రాజెక్ట్స్ లలో ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్యలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుందన్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టు పనులలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల జూన్ 21వ తేదీన జరగబోయే యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు యోగ ప్రోటోకాల్స్ పాటించి విజయవంతం చేయాలన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ లో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో యోగ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యోగా ప్రమోషన్ అండ్ అవేర్నెస్ యాక్టివిటిస్ లో భాగంగా ఈ నెల 21 మే అన్ని జిల్లాల్లో కర్టెన్ రైజన్ కార్యక్రమం నిర్వహించి జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ యోగా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి మండలంలో యోగా రిజిస్ట్రేషన్స్ , మాస్టర్ ట్రైనర్లను, అనువైన ప్రాంతాలను గుర్తించించాలన్నారు. మండల స్థాయిలో యోగ పై ర్యాలీలు, రంగోలి, కాంపిటీషన్స్ నిర్వహించాలన్నారు .జిల్లా కలెక్టర్ లు యోగాంధ్ర పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా సబార్డినేట్ కోర్టులలో దెబ్బతిన్న మరియు కొత్త టాయిలెట్స్ కాంప్లెక్స్ లను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు సేవలపై వచ్చే ప్రజా స్పందనలపై తేలికగా తీసుకోకుండా జిల్లా కలెక్టర్లు సమీక్ష చేసి నిరంతరం మానిటరింగ్ చేయాలన్నారు.
ఒంగోలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఒ వెంకటనాయుడు, సిపిఓ వెంకటేశ్వర రావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, డ్వామా, ఐసిడిఎస్, మెప్మా పిడీలు జోసెఫ్ కుమార్, హేన సుజన, శ్రీహరి, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

