తెలుగు దేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మేడగం వెంకటేశ్వర రెడ్డినిమండల పార్టీ నాయకులు ఎంపీపీ ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పుష్పగుజ్జం అందించి శాలువాతో ఘనంగా నన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యున్నతికి అందరితో కలిసి ముందుకు సాగుతానని, అందరూ తమ సహకరం అందించాలని మేడగం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, తాజా మాజీ పార్టీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి, పార్టీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శులు మానం రమేష్, శాగం కొండా రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.
