తూర్పు గంగవరం విద్యుత్ సబ్ స్టేషన్ ను ఈఈ పాలగిరి శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాడైన మెటీరియల్ ను వెంటనే మార్చుకోవాలని చెప్పారు. వర్షాలు సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని కోరారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే జాగ్రత్తగా పరిశీలించాలని ఫెయిల్యూర్ ను తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాలకు ఆక్సిడెంట్స్ కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేసి, జాగ్రత్తలు తెలయజేయాలని చెప్పారు.
పీఎం సూర్య ఘర్ పథకంలో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడి ని సద్వినియోగం చేసుకోవాలని, ఇది అద్భుత పథకమని , మన ఇంటి దగ్గరే మనం పర్యావరణ హితమైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి బిల్లు తగ్గించుకోవచ్చని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న లోడు ను 50% సబ్సిడి తో వాలంటీర్ లోడ్ రెగ్యులైజేషన్ పథకంలో క్రమబద్ధీకరించుకోవలసినదిగా తెలియజేశారు. ఈ స్కీమ్ నెలలో ముగియనుందని ప్రజలు దీనిని సద్వినియోగ పరచుకోవలసిందిగా తెలియపరిచారు.
కార్యక్రమంలో ఏడిఈ రవికుమార్, జేఈ ఇమ్మానియేల్ బాబు , ఎల్ ఎం లు సిబ్బంది పాల్గొన్నారు
