ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 68వ వర్గంతిని పురస్కరించుకుని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణ లోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బి.ఎన్. విజయకుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్ కుమార్, జిల్లాఅధికారులు,ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్ ను సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ… దేశస్వాతంత్ర్య పోరాటంలోనూ, దేశాభివృద్దిలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆయన ఆశయసాధనకు కృషి చేద్దామన్నారు. ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ …ధైర్యసాహసాలకు ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం స్పూర్తిదాయకమన్నారు. రాజకీయాలలో వారు నెలకొల్పిన విలువలు మనకు ఆదర్శమన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు విజయకుమార్ మాట్లాడుతూ….న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్దానంలో ఉన్నప్పటికీ త్యాగం చేసి దేశ స్వాతంత్ర్యంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ…. టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం మనకు ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, సెట్నల్ సీఈఓ శ్రీమన్నారాయణ, ప్రకాశం భవనంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





